హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు..నగరవాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీ

హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నగరవాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీ చేయిస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై శ్రీలకంతోపాటు భారత్ లో కేసులున్నాయి. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
విదేశీ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్న శణ్ముఖ పవన్ అలియాస్ శ్రీనివాస్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా నగరవాసులకు సంబంధించి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాగుతూ విదేశాల్లో సర్జరీలు చేయిస్తామని చెప్పి నిందితుడు శ్రీనివాస్ మోసాలకు పాల్పడుతున్నాడు.
శ్రీలంకతోపాటు వివిధ దేశాల్లోని రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. నిందితుడు హైదరాబాద్ లో ఏజెంట్ గా ఉంటూ ఇంటర్నెట్ ఆన్ లైన్ ద్వారా ఎవరైతే కిడ్ని డోనర్ ఉన్నారో, కిడ్నీలు ఎవరికైతే అవసరమున్నాయో వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నాడు. కిడ్ని అవసరమున్న వారికి ఇతర దేశాల్లో ఆపరేషన్ చేస్తామని ఆఫర్లు ఇవ్వడం, అలాగే వారి నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకొని మోసాలకు పాల్పడుతున్నాడు.
ఈ విధంగా కిడ్నీ అవరమున్న వారి పూర్తి వివరాలు శ్రీలంక, టర్కీలో ఉన్న వైద్యులకు శ్రీనివాస్ చేరవేస్తున్నాడు. లక్షా 50 వేల రూపాయల వరకు అతను కమీషన్ పొందుతున్నాడని విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ లో, అలాగే ఏపీలో కూడా అతనిపై మూడు కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 506, 420 సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ తోపాటు విజయవాడలోని కృష్ణలంకపై మూడు కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు సంబంధించి ఒక డోనర్ తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు నిందితుడు శ్రీనివాస్ ను విచారించారు.