రూ.10వేలు లంచమిస్తే 6నెలలు మీ జోలికి రాను : అటవీ అధికారి బంపర్ ఆఫర్
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్‌లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు

కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్‌లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్‌లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు దిగారు. లంచం కోసం డిమాండ్ చేశారు. కేసు పెట్టకుండా విడిచి పెట్టాలంటే ట్రాక్టర్‌కు 10వేల చొప్పున చెల్లించాలని నిస్సిగ్గుగా అడిగేశారు. అంతేకాదు..అడిగినంత ఇచ్చేస్తే మీకో స్పెషల్ ఆఫర్ ఉందని కూడా ప్రకటించారు. ఆరు నెలల వరకు మీ జోలికి రాబోమంటూ భరోసా ఇచ్చిన ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.
దీనిపై అటవీశాఖ అధికారి చంద్రకాంత్ రెడ్డి స్పందించారు. ఆరోపణలను ఆయన ఖండించారు. తానెవరినీ లంచం డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చారు. అసలు ఆ వ్యక్తులెవరో కూడా తనకు తెలియదని అంటున్నారు. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లను ఖచ్చితంగా తమ ఆఫీసుకు తరలించి కేసులు పెడతామని చెబుతున్నారు.