సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2020 / 09:46 PM IST
సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

Updated On : October 7, 2020 / 9:58 PM IST

Former CBI Director Ashwani Kumar Suicide సీబీఐ మాజీ డైరెక్టర్,మనిపూర్ అండ్ నాగాలాండ్ మాజీ గవర్నర్​ అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ శిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.


ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ కు భార్య చందా,కొడుకు,కోడలు ఉన్నారు.


1973 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అశ్వినీకుమార్ హిమాచల్ ప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన సిర్మౌర్ జిల్లాకు చెందినవాడు. 2006-2008 మధ్య హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా అశ్వినీకుమార్ పనిచేశారు. 2008-2010వరకు సీబీఐ డైరక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత మనిపూర్ అండ్ నాగాలాండ్ గవర్నర్ గా సేవలందించారు.