Gas Cylinder Blast: బాబోయ్.. బాంబులా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి.. మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం..

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Gas Cylinder Blast: బాబోయ్.. బాంబులా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి.. మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం..

Updated On : August 5, 2025 / 12:57 AM IST

Gas Cylinder Blast: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ లోని మార్కెట్ లో ని ఓ ఇంట్లో పూల షాప్ తో పాటు మొబైల్ ఫోన్ షాప్ ఉంది. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉంటున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు.

అదే సమయంలో బోర్ లారీలో వెళ్తున్న ఒకరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లోని సామాను దెబ్బతింది. పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.