పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు

ఇటీవలకాలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించే ఈ గన్ కల్చర్.. తెలంగాణలో కూడా కనిపించింది.

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 07:01 AM IST
పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

ఇటీవలకాలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించే ఈ గన్ కల్చర్.. తెలంగాణలో కూడా కనిపించింది.

ఇటీవలకాలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించే ఈ గన్ కల్చర్.. తెలంగాణలో కూడా కనిపించింది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో సిటీ బస్సులో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళుతున్న బస్సు (47 ఎల్) నెంబర్ ఏపీ 28 జెడ్ 4468 బస్సు పంజాగుట్ట దగ్గరకు రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణీకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా బస్సు దిగమన్నందుకు కాల్పులకు తెగబడ్డాడు. గన్ నుంచి బయటకు బుల్లెట్ బస్సు టాప్ నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణీకులు ఒక్కసారిగా భయపడ్డారు.
Also Read : వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

అయితే కాల్పుల ఘటన జరగగానే భయపడిన బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండానే వెళ్లిపోయాడు. వెంటనే విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని నాందేడ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి సఫారీ డ్రెస్ వేసుకుని ఉండగా.. ఆ వ్యక్తి గన్‌మెన్‌గా పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నారు. కాల్పులకు దిగిన వ్యక్తితో గొడవపడిన వ్యక్తి ఓ ఛానెల్‌లో కెమెరామెన్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 
Also Read : అమ్మబాబోయ్ : పాములతో ఆటలాడిన ప్రియాంక గాంధీ