Air Force Officer Molestation : ఎయిర్స్ ఫోర్స్ స్టేషన్ లో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు

Air Force Officer Molestation
Air Force Officer Molestation : పని చేసే చోట మహిళలు తోటి ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోంటూ ఉంటారు. ఇందుకు సంబంధించి మహిళలరక్షణ కోసం ఎన్న చట్టాలు చేసినా వాటి గురించి ఎవరూ భయపడకపోవటంతోటే నిందితులు రెచ్చిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఒక ఉన్నతోద్యోగి తనపైలైంగికవేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్వాల్ లో నివసిచే ఓ మహిళ(35) … హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పనిచేస్తోంది.
కొన్ని రోజులుగా ఆమె తన సీనియర్ ఉద్యోగి ఎస్.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని…. రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్ ఫోర్స్ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేసింది. అధికారులు సూచన మేరకు అల్వాల్ పోలీసుస్టేషన్ లోఫిర్యాదుచేసింది కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.