Woman Kills Husband : భర్త మర్మాంగం కోసి హత్య చేసిన భార్య
తన భర్త మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. గతి లేని పరిస్థితుల్లోనే తన భర్తను చంపేశానని నేరాన్ని ఒప్పుకుంది.

Woman Kills Husband
Woman Kills Husband : ఎన్నో ఆశలతో ప్రతి యువతి పెళ్లి చేసుకుంటుంది. భర్త తనకు జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి తల్లిదండ్రులను వదిలి అత్తారింటికి వస్తుంది. కానీ, కొంతమంది విషయంలో ఈ ఆశ నిరాశ అవుతోంది. భర్త వికృత రూపం తెలిసి బయటకు చెప్పుకోలేక నరకం అనుభవించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. మరికొందరు అలాంటి శాడిస్ట్ భర్తలను పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపిస్తారు. ఇంకొందరు.. నిస్సహాయ స్థితిలో తాళి కట్టిన భర్తను కడతేరుస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ దిగాస్ ప్రాంతంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. రోజూ తాగొచ్చి గొడవ పడుతున్న భర్తను(35) భార్య(28) దారుణంగా హత్య చేసింది. అతడి మర్మాంగం కోసి చంపేసింది.
Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్
దిగాస్ ప్రాంతంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని చంపేటప్పుడు చూసిన కూతురు(12) పోలీసులకు ఈ విషయాలు చెప్పింది. తన భర్త మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. గతి లేని పరిస్థితుల్లోనే తన భర్తను చంపేశానని నేరాన్ని ఒప్పుకుంది.
Delhi Girl Murder : భార్య బంధువుల ఇంటికి-ప్రియురాలు పడక గదికి-హత్య చేసిన ప్రియుడు
మృతుడు దినసరి కూలీ. పొద్దునే పనికి వెళ్తాడు. రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు పీకల దాకా తాగి వస్తాడు. ఇంటికి వచ్చాక తనతో గొడవపడే వాడని, చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. రోజురోజుకి పెరిగిపోతున్న భర్త వేధింపులు తాళలేక అతడిని చంపేసినట్టు పోలీసుల విచారణలో ఆమె ఒప్పుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. భర్త హత్యకు ఆమె వాడిన రేజర్, తాడుని ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితురాలిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆమెకు 14రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు.