Crime News: కర్రతో 5 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపిన వైనం..

ఆ బాలుడి కడుపులోనూ అతడు కర్రతో కొట్టడంతో ఆ చిన్నారి అక్కడే పడిపోయాడు.

Crime News: కర్రతో 5 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపిన వైనం..

crime

Updated On : June 25, 2023 / 3:54 PM IST

Crime News – Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌(Bilaspur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిని కర్రతో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై ఆ చిన్నారి తల్లి తలాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి కుటుంబం బుహర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది.

ఆ కుటుంబానికి, వారి బంధువులకు మధ్య శనివారం గొడవ జరిగింది. వారు కర్రలతో కొట్టుకున్నారు. ఓ బంధువు కర్రతో ఓ మహిళను కొట్టసాగాడు. అక్కడే ఐదేళ్ల బాలుడు నిలబడి ఉన్నాడు. ఆ బాలుడి కడుపులోనూ అతడు కర్రతో కొట్టడంతో ఆ చిన్నారి అక్కడే పడిపోయాడు.

ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడికి దెబ్బ గట్టిగా తగలడంతో అతడి పరిస్థితి విషమించి ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ ఘుమార్విన్ ఛందర్పాల్ చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

New Delhi : న్యూ ఢిల్లీలో భారీ వర్షం.. రైల్వే స్టేషన్‌లో విద్యుత్‌ఘాతంతో మహిళ మృతి