ఘోర రోడ్డు ప్రమాదం..కారు టైరు పేలి ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..కారు టైరు పేలి ఏడుగురు మృతి

Updated On : February 24, 2021 / 5:32 PM IST

Horrific Road Accident on Yamuna Expressway, Seven Killed : ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి కారు ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. హర్యానాకు చెందిన మనోజ్, బబితా, అభయ్, హేమంత్,ఖన్ను, హిమాద్రి, రాకేష్ అనే వారు కారులో ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాకు బయలు దేరారు.

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కారు యుమునా ఎక్స్ ప్రెస్ హైవే పై వెళుతోంది. ఈ నేపథ్యంలో కారు టైరుపేలి నోయిడానుంచి ఆగ్రావేపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. దీంతో కారునుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ఘటనా స్ధలంలోనే మరణించారు.

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.