Chhattisgarh Encounter : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 29 మంది మృతి?

ఎదురు కాల్పుల్లో ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.

Chhattisgarh Encounter : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 29 మంది మృతి?

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. భారీ పరిమాణంలో INSAS/AK 47/SLR/Carbine/303 రైఫిల్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో DRG, BSF ఉమ్మడి పార్టీ.. మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 29 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించడం జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో గాయపడ్డ సైనికులకు మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ లో జిల్లా కేంద్రానికి తరలించారు.

ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.

నిన్ననే మావోయిస్టుల ఐదు రాష్ట్రాల బంద్ కి పిలుపునిచ్చారు. ప్రతీకారానికి మావోయిస్టులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. జవాన్ల ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల భారీ ప్రాణ నష్టం జరిగినట్లు వెల్లడించారు. 25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కమాండర్ శంకర్ రావు, మహిళా కమాండర్ లలిత ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : డబ్బే డబ్బు.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లు, హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు