భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కరోనా కారణంగా విద్యార్థులకు పాఠాలు మిస్ కాకుండా ఉండేందుకు విద్యాసంస్థలు ఎక్కువగా ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాస్ లు వినేందుకు తమ పిల్లల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని భార్య తన భర్తను అడిగింది.
అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత కొందామని భర్త చెప్పాడు. ఫోన్ కొనే విషయంలో మనస్థాపం చెందిన భార్య ఒంటికి నిప్పంటించుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం మహిళను సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
కాగా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లి చనిపోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.