దారుణం : భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టిన భర్త
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.

సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం గౌతమి, రామలింగం దంపతులు. 5 సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయింది. వీరికి పాప కూడా ఉంది.
మూడు నెలలుగా భార్యపై అనుమానంతో భర్త రామలింగం ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు. రామలింగం, అత్తమామలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. రామలింగం తన కుటుంబసభ్యులతో కలిసి గౌతమి కాళ్లు, చేతులపై ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.
రామలింగం వేధింపులు రోజు రోజుకూ అధికమవుతుండటంతో బాధితురాలు గౌతమి.. మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి సూచనల మేరకు బాధిరాలు పోలీస్ స్టేషన్ లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలంటూ వేడుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.