తమ్ముడు చేసిన పని సంతోషం కలిగించింది….రియల్ హీరో సజ్జనార్ సోదరుడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన్న ఓ బ్రిడ్జి కింద దిశను నిందితులు దహనం చేసిన చోటే వారిని హతం చేశారు.
నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు్నారు. హైదరాబాద్ సీపీ వీఎస్ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో సజ్జనార్ అంటూ ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో ఫేర్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి దేశం గర్విస్తోందని మెచ్చుకుంటున్నారు.
అయితే కర్ణాటకలో నివసించే సీపీ సజ్జనార్ అన్న డాక్టర్ మల్లిఖార్జున సజ్జనార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తన తమ్ముడు చేసిన పని వల్ల రేపిస్టులకు కఠినమైన సందేశం వెళ్లిందని,రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్… నిందితులకు ఓ రకమైన భయంకరమైన వాతావరణం కన్పించేలా ఉందని అనిపిస్తుందన్నారు. తన తమ్ముడు ఎప్పుడూ న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన అన్నారు.