Gold Cheating : ఇత్తడిని పుత్తడిగా నమ్మించి కోట్లు దోచుకున్నాడు
తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని తెలుగు సామెత..ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారం వ్యాపారులకుటోకరా వేసి కోట్లరూపాయలు దోచుకున్న మోసగాడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్

Man Cheating Jewelary Shops
Gold Cheating : తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని తెలుగు సామెత..ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారం వ్యాపారులకుటోకరా వేసి కోట్లరూపాయలు దోచుకున్న మోసగాడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ లో నివసించే వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు చేయించేవాడు. వాటికి బంగారం కోటింగ్ వేయించి, హాల్ మార్క్ గుర్తుతో సహా జ్యూయలరీ షాపులకు తీసుకు వెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు.
ఈరకంగా బోరబండ, రహమత్ నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలు తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోటానికి రాకపోవటంతో అనుమానం వచ్చిన వ్యాపారులు ఆ నగలను పరిశీలించారు. అవన్నీ నకిలీ గిల్టు నగలుగా తేలింది. వ్యాపారలంతా లబోదిబోమన్నారు.
శుక్రవారం మళ్లీ కొన్ని గిల్టు నగలు తీసుకుని వెంకటరెడ్డి తాకట్టు పెట్టటానికి బోరబండలోని ఒక నగల దుకాణానికి వెళ్లాడు. అప్పటికే అతడి గురించి బులియన్ మార్కెట్ లో అందరికీ తెలియటంతో అలర్టైన వ్యాపారస్తుడు పోలీసులకు ఫోన్ చేసి, స్ధానిక బంగారం వర్తకులను అలర్ట్ చేశాడు. వారంతా వచ్చి వెంకట్ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 18 మంది వ్యాపారస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.