Hyderabad : హైదరాబాద్‌లో పబ్‌లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో  పబ్‌ల నిర్వహణకు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ కొత్త రూల్స్ పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు మూసి వేయాలని ఆదేశించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో పబ్‌లు,బార్లకు కొత్త రూల్స్-పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్

Cv Anand

Updated On : May 13, 2022 / 4:38 PM IST

Hyderabad :  హైదరాబాద్‌లో  పబ్‌ల నిర్వహణకు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ కొత్త రూల్స్ పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు మూసి వేయాలని ఆదేశించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

ఈ నేపధ్యంలో నగరంలోని సుమారు 100 బార్లు, పబ్‌ల ప్రతినిధులతో ఆయన ఈరోజు సమావేశం అయ్యారు. పబ్‌ల నిర్వహణకు కొత్త నియమావళిని ఆయన వారి ముందుంచారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పని సరిగా అమలు చేయాలని కోరారు. పబ్‌లు, బార్లలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల బ్యాక్ అప్ నెల రోజుల పాటు మెయింటైన్ చేయాలని ఆదేశించారు. సౌండ్ పొల్యూషన్ విషయంలో ఖచ్చితంగా నిబందనలు పాటించాలని… అట్లు పాటించని పబ్బులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘించాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సమావేశానికి హాజరైన వారందరికీ అయన పవర్ పాయింట్ ప్రజటేంషన్ ద్వారా పోలీసు చట్టంలో నిర్దేశించబడిన నిబంధనల గురించి తెలియచేశారు. రాత్రి11 గంటలకు వచ్చే ఆర్డర్లను అంగీకరించవద్దని… శుక్ర,శనివారాల్లో బిల్ సెటిల్ చేయటానికి, అరగంట గ్రేస్ పీరియడ్ అదనంగా మరో గంట మినహాయింపు అనుమతించబడుతుందని చెప్పారు.
Also Read : SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్