తన స్నేహితురాలితో మరోక వ్యక్తి అక్రమ సంబంధం : వ్యక్తి హత్య, పూడ్చివేత

politician assassinated young man, due to illegal affair : హైదరాబాద్ అల్వాల్ లో దారుణం జరిగింది. తన స్నేహితురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కనకరాజు యాదవ్ అనే వ్యక్తి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపి పూడ్చి పెట్టాడు.
ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ లోని అంజయ్య నగర్ లో నివసించే కనకరాజు యాదవ్ అనే వ్యక్తి ఒక యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఆ యువతి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆరు నెలల క్రితం శ్రీకాంత్ రెడ్డి ఆ అమ్మాయిని తీసుకుని పరారయ్యాడు. తాను సన్నిహితంగా ఉన్న యువతి కనపడకపోవటంతో ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. ఆ యువతి శ్రీకాంత్ రెడ్డితో పారిపోయినట్లు గుర్తించాడు. వారిద్దరు ఎక్కడున్నారో తెలుసుకుని వారిని హైదరాబాద్ తీసుకు వచ్చాడు.
శ్రీకాంత్ రెడ్డిని జవహర్ నగర్ లోని ఒక ఇంటిలో 10 రోజులు బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. అనంతరం ఐదురోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డిని చంపి, మానస సరోవరం సమీపంలోని స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు. మద్యం మత్తులో కనకరాజు ఈ విషయాన్ని మిత్రులకు చెప్పటంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం తెలుసుకున్నపోలీసులు కనకరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్య చేసిన విషయాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. స్మశాన వాటికలోనే శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి పోలీసులు పంచనామా పూర్తిచేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు.
కాగా…. అంజయ్య నగర్ లో కనకరాజు యాదవ్ గతంలో టీఆర్ ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించేవాడు. ఇటీవలే బీజేపీలో చేరాడు. ఈ విషయం టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోక జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అతన్ని తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక కార్పొరేటర్ గెలుపు కోసం కూడా కనకరాజు చురుగ్గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.కనకరాజు హత్య చేసిన విషయం ప్రస్తుతం ఈ ప్రాంతంలో చర్చనీయాంశం అయ్యింది.