Extra Marital Affair : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని….
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి కొడుకును తీవ్రంగా కొట్టటంతో బాలుడు కన్నుమూసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Extra Marital Affair
Extra Marital Affair : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి కొడుకును తీవ్రంగా కొట్టటంతో బాలుడు కన్నుమూసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివసిస్తున్న సురేష్, ఉదయ భార్యా భర్తలు. వారికి ఉమేష్(3) అనే కుమారుడు ఉన్నాడు. ఉదయ, భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
రెండేళ్ల క్రితం మూడేళ్ల కొడుకును తీసుకుని భర్తతో విడిపోయి భాస్కర్‌తో కలిసి జీవిస్తోంది. మంగళవారం ఉదయం కోపంలో ఉన్న ఉదయ కొడుకు ఉమేష్‌ను తీవ్రంగా కొట్టింది. తల్లి కొట్టిన దెబ్బలకు బాలుడు స్పృహ కోల్పోయాడు.
వెంటేనే వారు బాలుడ్ని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కాగా సమాచారం తెలుసుకున్న ఉదయ భర్త సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భాస్కర్, ఉదయ లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని… వారి పెళ్లికి తన కుమారుడు అడ్డువస్తున్నాడని ఇద్దరూ కలిసి కొట్టి హత్య చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.