Delhi : ఫోన్‌లో మాటల మాయాజాలంతో రూ.40వేలు దోచేసిన కేటుగాడు.. హిప్నటైజ్‌తో మోసం చేశాడంటూ లబోదిబోమన్న జర్నలిస్టు..

ఫోన్‌లో హిప్నటైజ్‌ సాధ్యమేనా..అలా డబ్బులు కాజేయొచ్చా..? ఢిల్లీలోని ఓ జర్నలిస్టుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి హిప్నటైజ్ చేసి డబ్బులు కాజేశాడట..మరి మీకెవరైనా ఫోన్ చేశారా? ఇటువంటి ఫోన్ల గురించి పోలీసులు ఏం చెబుతున్నారంటే..

Delhi : ఫోన్‌లో మాటల మాయాజాలంతో రూ.40వేలు దోచేసిన కేటుగాడు.. హిప్నటైజ్‌తో మోసం చేశాడంటూ లబోదిబోమన్న జర్నలిస్టు..

phone Hypnotized

Updated On : May 12, 2023 / 12:51 PM IST

Delhi : అతనో జర్నలిస్టు..అతనికి ఓ రోజున ఓ ఫోన్ కాల్ వచ్చింది.ఎవరో తెలియకపోయినా ఫోన్ లిప్ట్ చేశాడు.అంతే అటువైపు వ్యక్తి చేసిన మాయమాటల్లో పడిపోయాడు. మెస్మైరైజ్ చేస్తు అతను చెప్పే మాటల్లో పడిపోయాడు. అలా మాటలు చెప్పిన సదరు వ్యక్తి అడిగిన డబ్బుల్ని తనకు తెలియకుండానే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించేశాడు సదరు జర్నలిస్టు..ఆ తరువాత కొంతసేపటికి తెలిసింది..తానుమోసపోయానని.. తనకు తెలియకుండానే ఫోన్ చేసిన వ్యక్తి మాయమాటల్లో పడి రూ.40వేలు పోగొట్టుకున్నానని..అంతే లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సార్ నన్ను ఓ వ్యక్తి ఫోన్ లో హిప్నటైజ్ చేసిన రూ.40వేలు కాజేశాడు సార్ అంటూ వాపోయాడు.

సదరు జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని చేసింది హిప్నటైజ్ కాదు..అతని మాటల నైపుణ్యానికి మోసపోయావు అంటూ చెప్పుకొచ్చారు. కానీ సదరు జర్నలిస్టు మాత్రం ఏమోసార్..అతను మాట్లాడుతుంటే నాకేమీ తెలియలేదు. అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. నా పాత స్నేహితుడినని నమ్మించాడు. అతని మాటలు విన్నాక నేను తర్కంతో ఆలోచించే శక్తిని కోల్పోయానని ఆ సమయంలోనే పేటీఎం ద్వారా నా బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బులు పంపించానని చెప్పాడు అమాయకంగా..దానికి సైబర్ క్రైమ్ పోలీసులు మాట్లాడుతు అది హిప్నటైజ్‌ కాదని, తరచుగా జరుగుతున్న సైబర్‌ మోసాల తరహాలో కూడా జరుగుతున్నాయని చెప్పేసరికి తెల్లబోయాడు.

కాగా ఈ మాయమాటలకు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంది. ఢిల్లీలో రమేశ్‌ కుమార్‌ రాజా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు. ఫోన్ చేసింది ఎవరో తెలియకపోయినా అతని మాయమాటల్లో పడిపోయాడు. అలా రూ.40 వేలు పోగొట్టుకున్నాడు. తరువాత మోసపోయానని తెలిసి ఏప్రిల్‌ 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేసి అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. తను నా పాత స్నేహితుడినని చెప్పాడు. దానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా చెప్పాడు. అది నిజమేననిపించింది. అలా తరచు కొన్ని రోజులు వరుసగా ఫోన్ చేసి మాట్లాడాడు. ఎన్నో విషయాలు మాట్టాడుకున్నాం. అతని ఫోన్ వస్తే చాలా బాగా అనిపించేది. అలా అతని మాటల్ని నమ్మేశాను. ఆ తరవాత ఏం జరిగిందో శక్తిని కోల్పోయినట్లు అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను మాటల్లో ముంచి పేటీఎం ద్వారా నా బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు జర్నలిస్టు రమేశ్ కుమార్. కానీ అది ఫోన్‌లో హిప్నటైజ్‌ చేయడం సాధ్యం కాదని హిప్నాటిజంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఓ వ్యక్తి చెప్పేసరికి తెల్లబోయాడు జర్నలిస్టు..