Horrific Racist Attack row: భారతీయ అమెరికన్ మహిళలపై జరిగిన జాత్యహంకార దాడిని ఖండించిన అక్కడి ఇండియన్లు
నలుగురు భారతీయ అమెరికన్ మహిళలపై టెక్సాస్ లో బుధవారం చోటుచేసుకున్నజాత్యహంకార దాడిపై అమెరికాలోని ఇండియన్లు స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు. ఇటీవల నలుగురు భారతీయ అమెరికన్ మహిళలను తిడుతూ ఓ మెక్సికన్-అమెరికన్ యువతి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పటికే ఆ మెక్సికన్-అమెరికన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి తీరు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ విస్మయం వ్యక్తం చేస్తోందని అమెరికాలోని భారత సంతతి వ్యక్తి సంజీవ్ జోషిపురా అన్నారు.

Horrific Racist Attack row
Horrific Racist Attack: నలుగురు భారతీయ అమెరికన్ మహిళలపై టెక్సాస్ లో బుధవారం చోటుచేసుకున్న జాత్యహంకార దాడిపై అమెరికాలోని ఇండియన్లు స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు. ఇటీవల నలుగురు భారతీయ అమెరికన్ మహిళలను తిడుతూ ఓ మెక్సికన్-అమెరికన్ యువతి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పటికే ఆ మెక్సికన్-అమెరికన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి తీరు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ విస్మయం వ్యక్తం చేస్తోందని అమెరికాలోని భారత సంతతి వ్యక్తి సంజీవ్ జోషిపురా అన్నారు.
ఇటువంటి జాత్యహంకార దాడులు, వివక్ష సరికాదని చెప్పారు. ఇటువంటి తీరుకి వ్యతిరేకంగా తాము పోరాడతామని అన్నారు. ఇటువంటి జాత్యహంకార ఘటనలను తేలికగా తీసుకుని వదిలేయవద్దని ఇండియన్-అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా చెప్పారు. ఇలాంటి కేసులు చట్టపరంగా ఎదుర్కోవడానికి తమకు అదృష్టవశాత్తూ వీడియో ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ నలుగురు భారతీయ అమెరికన్ మహిళలపై భౌతికంగా దాడి జరగలేదని అన్నారు. ఇటువంటి జాత్యహంకార ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
వారితో పాటు పలువురు భారతీయ అమెరికన్లు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కాగా, టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసే చోట నలుగురు భారతీయ అమెరికన్ మహిళలపై మెక్సికన్-అమెరికన్ యువతి పలు వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలని పొగరుగా మాట్లాడింది. భారతీయులు అంటే తనకు ద్వేషమని, మంచి జీవితాన్ని గడపడానికే భారతీయులు అమెరికాకు వస్తారని ఆమె వ్యాఖ్యలు చేసింది.
Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో