D-martలో దారుణం : చాక్లెట్ దొంగిలిస్తే కొట్టి చంపుతారా
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్

హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్(dmart) సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సతీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం(ఫిబ్రవరి 16,2020) రాత్రి షాపింగ్ కోసం వనస్థలిపురంలోని డీమార్ట్ వెళ్లాడు. అక్కడ డీమార్ట్ సెక్యూరిటీకి, సతీష్ కు మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది సతీష్ ను కొట్టారు. దీంతో సతీష్ స్పాట్ లోనే చనిపోయాడు.
సతీష్ చాక్లెట్ దొంగలించాడనే నెపంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మూర్ఛ వచ్చి సతీష్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఫ్రెండ్స్ సతీష్ ని స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సతీష్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డీమార్ట్ దగ్గర ఆందోళన చేశారు.
కాలేజీ యాజమాన్యంపైనా సతీష్ తల్లిదండ్రులు మండిపడ్డారు. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కాలేజీ యాజమాన్యం పిల్లలను ఎందుకు బయటకు పంపిందని.. సతీష్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. తమ కుమారుడి మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణం అన్నారు. డీమార్ట్, కాలేజీ యాజమాన్యంపై సతీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
కాగా, చాక్లెట్ దొంగలించాడనే నెపంతో విద్యార్థిని కొట్టి చంపడం సంచలనంగా మారింది. ఈ మాత్రం దానికే కొట్టి చంపేస్తారా అని మండిపడుతున్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే.. మందలించి ఉంటే సరిపోయేది.. ఇలా దాడి చెయ్యం కరెక్ట్ కాదని అంటున్నారు. పది రూపాయలు కూడా ఖరీదు చేయని చాక్లెట్ కోసం నిండు ప్రాణం తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ దొంగతనం నెపంతోనే సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం, ఆ దెబ్బలకే సతీష్ చనిపోయాడని నిజమే అని పోలీసుల విచారణలో తేలితే.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More>>తుపాకీలతో వచ్చిన టిష్యూ దొంగలను వెతుకుతున్న పోలీసులు