Tamilnadu : భర్త ఇంట్లో టాయిలెట్ లేదని ఆత్మహత్య చేసుకున్న భార్య
కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Tamilnadu
Tamilnadu : కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
కడలూర్ జిల్లాలోని అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య(27) ప్రైవేట్ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఏప్రిల్ 6వ తేదీన కార్తికేయన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కాపురానికి వెళ్లే సమయంలో ఎంక్వైరీ చేసుకోగా భర్త నివసిస్తున్న ఇంట్లో మరుగుదొడ్డి లేదని తెలిసింది. దీంతో ఆమె తన తల్లి వద్దే ఉంటోంది.
కడలూర్ లో టాయిలెట్ వసతి ఉన్న ఇల్లు అద్దెకు చూడమని భర్తకు చెప్పింది. ఈవిషయమై గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈవిషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన ఆమె తల్లి మంజుల రమ్యను హుటాహుటిన కడలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ఆమెను మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరి లోని జిప్‌మర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. రమ్య తల్లి మంజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్