తమిళనాడులో ఐటీ దాడులు

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 04:24 AM IST
తమిళనాడులో ఐటీ దాడులు

Updated On : April 17, 2019 / 4:24 AM IST

తమిళనాడులో రాజకీయ పార్టీలకు ఐటీ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ఐటీ, ఈసీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. థేనిలోని ఏఎంఎంకే పార్టీ కార్యాలయంలో రూ.50 లక్షలు, ఆదిపిట్టిలో రూ.1.4 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కనిమొళి నివాసంలో పది మంది ఐటీ అధికారులు సోదాలు చేశారు.