జయరామ్ హత్య కేసు : మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : చిగురుపాటి జయరామ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పొలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో రాకేష్ రెడ్డి, శ్రిఖాలను విచారించారు. జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిరిసిల్లకు చెందిన కౌన్సిలర్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములును విచారిస్తున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డితో కలిసి ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. కౌన్సిలర్ భర్తతో రాకేష్ రెడ్డికి పరిచయం ఉంది. రాకేష్ రెడ్డి రూ.10 లక్షలు ఇవ్వాలని విచారణలో అంజిరెడ్డి వెల్లడించారు. జయరామ్ ను హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి..అంజిరెడ్డిని ఇంటికి పిలిచారు. రాకేష్ రెడ్డి ఇంట్లో జయరామ్ మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి అంజిరెడ్డి, అతని మిత్రులు పారిపోయారు. హత్య విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు.