Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

karate kalyani
Karate Kalyani : అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకర కంటెంట్ ఉన్న ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులు కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆమె ఫిర్యాదు చేసిన వాటిలో శ్రీకాంత్ రెడ్డి నడిపే అసభ్యకర యూ ట్యూబ్ చానెల్ ఫ్రాంక్ పోరీలూ, గల్లి బాయ్ ఇంకా అనేక ఛానెల్స్ ఉన్నాయి. ఇటీవల ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవపడిన ఆమె అతని గురించి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా మహిళలను కించపరుస్తూ అసభ్యకర వీడియోలు చేస్తే సహించేది లేదని వారిపై పోరాటం చేస్తానని కళ్యాణి పేర్కోంది.
అందులో భాగంగానే ఆమె ఈ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో మరికొన్ని అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలతో సహా ఆమె సీసీఎస్ పోలీసులకు అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ వివరాలు అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ పై ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి యూట్యూబ్ అసభ్యకర చానెళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.
Also Read : Facebook : ఫేస్‌బుక్‌లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!