Romance On Bike : రెచ్చిపోయిన ప్రేమజంట-నడిరోడ్డుపై రోమాన్స్

ప్రేమికులు సాధ్యమైనంత వరకు ప్రైవసీ కోరుకుంటారు. తమను ఎవరూ గమనించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు.

Romance On Bike : రెచ్చిపోయిన ప్రేమజంట-నడిరోడ్డుపై రోమాన్స్

Romance On Bike

Updated On : April 23, 2022 / 1:58 PM IST

Romance On Bike: ప్రేమికులు సాధ్యమైనంత వరకు ప్రైవసీ కోరుకుంటారు. తమను ఎవరూ గమనించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకోసం పార్కుల్లోనో, నిర్మానుష్య ప్రదేశాల్లోనో వారు కలుసు కుంటూ ఉంటారు. కానీ కర్ణాటకలో ఇందుకు విరుధ్ధంగా ఒక ప్రేమ జంట సిగ్గు విడిచి నడిరోడ్డుపై రోమాన్స్ చేశారు. వీరిని చూసిని వాహన చోదకులు ముక్కున వేలేసుకున్నారు.

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా  గుండ్లుపేట ప్రధాన రహదారిపై  ఓప్రేమ జంట బైక్ పై ప్రయాణిస్తున్నారు. అందులో యువతి పెట్రోల్ ట్యాంక్ పై అబ్బాయికి ఎదురుగా కూర్చుని ఉంది. అబ్బాయి బైక్ నడుపుతుంటే అతడ్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించ సాగింది. అతడు కూడా ఆమెకు ముద్దులు కురిపిస్తూ  ఆమెతో సరసాలాడుతూనే బైక్ నడిపాడు.
Also Read : Bride Cheating : పెళ్లికి మూడు రోజలు ముందు డబ్బు తీసుకుని వధువు పరార్
రోడ్డుపై  భారీ వాహనాలు వచ్చిపోతున్నా….వారంతా చూస్తున్నారనే స్పృహ లేకుండా వారు రోమాన్స్ చేశారు. ఇదంతా మరోక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా బైక్ పై కేసు నమోదు చేసినట్లు చామరాజనగర్ డీఎస్పీ తెలిపారు.