అలా దొరికిపోయింది : ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాపైన చిన్నారి క్షేమం
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.

మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు అప్పగించారు. 5 రోజుల క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చిన్నారిని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేశారు. ఇంతలో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారిని గుర్తించారు. అనూహ్య సంఘటనల మధ్య చిన్నారి ఆచూకీ తెలిసింది.
చికిత్స కోసం ఓ మహిళ చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చింది. డాక్టర్లకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ అయిన చిన్నారిగా గుర్తించారు. కిడ్నాప్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ముఠాకి సంబంధించి కృష్ణా జిల్లా మైలవరంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి ఆచూకీ లభించడం, సేఫ్ గా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి ఎక్కడుంది, ఏమైంది, క్షేమంగా ఉందో లేదో అని తల్లిదండ్రులు, పోలీసులు కంగారుపడ్డారు. చివరికి సేఫ్ గా ఉండటంతో అంతా రిలాక్స్ అయ్యారు. ఖమ్మంలో ప్రభుత్వాస్పత్రిలో నవంబర్ 26న 16 రోజుల నవజాత శిశువు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.