కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన.. ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హత్యాచారం జరిగిన తరువాత బాధితురాలిపై వస్త్రాలు లేవని, శరీరంపై గాయాలున్నాయని..

కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన.. ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court

Supreme Court:  కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కార్ ఆస్పత్రి బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని చెప్పింది. అలాగే, వైద్యులు వెంటనే ఆందోళనలు విరమించాలని ఆదేశించింది.

కోల్‌కతా హత్యాచార ఘటనపై దర్యాప్తునకు సీబీఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చింది. వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వచ్చే మంగళవారం సీబీఐ దర్యాప్తు నివేదికపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

హత్యాచారం జరిగిన తరువాత బాధితురాలిపై వస్త్రాలు లేవని, శరీరంపై గాయాలున్నాయని సుప్రీంకోర్టుకు సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన సీఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఎయిమ్స్ కి పంపి పరిశీలించాలని సీబీఐ నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు సోలిసిటరీ జనరల్ చెప్పారు.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజిని తాము పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది. హత్యాచార ఘటన జరిగిన సమయం వివరాలను బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు చెప్పింది. కాగా, వైద్యులు ఆందోళనలు విరమించాలని, వారు ఉన్నదే రోగులకు చికిత్స అందించేందుకని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది.

మహిళలు ఇళ్లలోనే ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి: రాహుల్ గాంధీ