ఆఫీసులో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన శ్రావ్య.. మిస్టరీగా మారిన లా విద్యార్థిని మృతి కేసు..
శ్రావ్య మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Islavath Shravya Incident : 20 ఏళ్ల యువతి. ఓవైపు లా చదువు. మరోవైపు ప్రాక్టీస్. ఇంకోవైపు పార్ట్ టైమ్ జాబ్. హాయిగా సాగుతుందనుకున్న జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అందరితో చలాకీగా మాట్లాడే ఆమె.. అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్య అని కొందరు అంటుంటు, కాదు హత్యేనని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మలక్ పేట్ లో లా విద్యార్థిని డెత్ మిస్టరీగా మారింది.
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో లా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూసారాంబాగ్ లో ఓ కన్సల్టెన్సీ ఆఫీసులో పని చేస్తున్న లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య ఆఫీసులో ఉరి వేసుకుంది. లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. శ్రావ్య ఆత్యహత్యకు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
రంగారెడ్డి కడ్తాల్ దగ్గర ఓ తండాకు చెందిన ఇస్లావత్ శ్రావ్య ఎల్బీ నగర్ లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో థర్డియర్ చదువుతోంది. ఓ సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్ గా పని చేస్తోంది. అలాగే మలక్ పేట్ మూసారాంబాగ్ లోని ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. నవంబర్ 24న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీసుకి వచ్చిన శ్రావ్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శ్రావ్య మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ ముందు కుటుంబసభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రావ్యది ఆత్మహత్య కాదని లైంగిక వేధింపులు చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు, గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శ్రావ్య మృతికి కారకులైన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని నవీన్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read : సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం