సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం

ఈ ఘటనతో మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.

సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం

Chain Snatching in Srikakulam Dist (Photo Credit : Google)

Updated On : November 23, 2024 / 11:13 PM IST

Chain Snatching : ఒంటరి మహిళలే టార్గెట్, కన్నుపడిందా ఖతమే.. రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు..

Chain Snatching : గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలనే ఇప్పటిదాకా టార్గెట్ చేసిన చైన్ స్నాచర్స్.. ఇప్పుడు ఏకంగా మహిళల ఇంట్లోకి చొరబడుతున్నారు. భయం లేకుండా బరి తెగిస్తూ మహిళల మెడలో నుంచి గొలుసులు తెంపుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ చైన్ స్నాచర్ తెల్లవారుజామున బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోటరీ నగర్ లో ఓ కిరాణ షాపు నడుపుతున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. నవంబర్ 23న ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రోటరీ నగర్ లో విజయ అనే మహిళ కిరాణ షాపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 23న ఉదయం ఓ వ్యక్తి షాపు దగ్గరికి వచ్చాడు. తనకు సిగరెట్ కావాలన్నాడు. ఆమె సిగరెట్ ఇచ్చింది. సిగరెట్ ను వెలిగించిన ఆ వ్యక్తి మరో అగ్గిపుల్ల ఇవ్వాలని కోరాడు. దాంతో ఆమె అతడికి మరో అగ్గిపుల్ల ఇస్తుండగా.. వెంటనే అతడు ఆమె మెడలోంచి బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. అప్పటికే కొద్ది దూరంలో మరో వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి పెట్టుకున్నాడు. గొలుసును తెంపుకెళ్లిన వ్యక్తి రాగానే ఇద్దరూ కలిసి బైక్ పై పారిపోయారు.

ఈ ఘటనతో కాశీబుగ్గ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చైన్ స్నాచర్లు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు మహిళలు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.

చైన్ స్నాచింగ్ గురించి సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా గొలుసు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సింగిల్ గా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Also Read : సినిమా స్టంట్ కాదు.. రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ వృద్ధులు.. వీడియో వైరల్