Extra Marital Affair : ప్రియుడి కోసం భర్తను చంపిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

నిర్మల్ జిల్లా బైంసా మండలంలో మీర్జాపూర్ గ్రామంలో 2014 లో జరిగిన  హత్యకేసులో ముద్దాయిలకి   జీవిత ఖైదు విధిస్తూ నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఈరోజు  జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్ప

Extra Marital Affair : ప్రియుడి కోసం భర్తను చంపిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Extra Marital Affair Judgement

Updated On : November 2, 2021 / 8:28 PM IST

Extra Marital Affair :  నిర్మల్ జిల్లా బైంసా మండలంలో మీర్జాపూర్ గ్రామంలో 2014 లో జరిగిన  హత్యకేసులో ముద్దాయిలకి   జీవిత ఖైదు విధిస్తూ నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఈరోజు  జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు.

మీర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం(43), కుంటాల మండలంలోని చక్ పల్లి గ్రామానికి చెందిన ఎస్కే.జమాల్(60) ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో షేక్ సలీం, జమాల్ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. జమాల్ ఇంటికి వచ్చి వెళ్లే క్రమంలో సలీం, జమాల్ భార్య అఫ్రీన్(35) తో పరిచయం పెంచుకున్నాడు.

ఆ పరిచయం ఆమెతో వివాహేతర సంబంధానికి దారి తీసింది.  ఈవిషయం భర్త జమాల్ కు ఎక్కడ తెలుస్తుందో అని భయం వేసిన అఫ్రీన్ భర్తను  అడ్డు తొలగించుకోవాలనుకుని సలీంకు చెప్పింది.  దీంతో ఇద్జరూ కలిసి ప్లాన్ వేశారు.  17-4-2014 సంవత్సరంలో రాత్రి జమాల్ ను హత్య చేయాలని నిందితులిద్దరూ ప్లాన్ చేశారు.
Also Read : TPCC Chief Revanth Reddy : హుజూరాబాద్ అపజయం పూర్తి బాధ్యత నాదే-రేవంత్ రెడ్డి
సలీం వ్యాపార భాగస్వామి కావటంతో ఆ రోజు సలీం జమాల్ ఇంటికి వచ్చాడు. రాత్రి భర్త జమాల్ నిద్రపోతున్న సమయంలో భర్త  నోట్లో గుడ్డలు కుక్కి గొంతు పిసికి చంపింది అఫ్రీన్.  అదే సమయంలో కొడవలి పిడితో జమాల్ తలపై కొట్టి హత్య చేశాడు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అఫ్రీన్, సలీం అక్కడి నుంచి పరారయ్యారు.

మర్నాడు పక్కింటి వాళ్లు చూసి  పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జమాల్ భార్య అఫ్రీన్  వివాహేతర సంబంధం విషయం బయటపడింది.  దీంతో పోలీసులు ఆకోణంలో గాలింపు చేపట్టి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ 14మంది సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టి నేరం రుజువు చేశారు. వాదనలు విన్న నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఈరోజు నిందితులైన అఫ్రీన్, సలీంలకు జీవితఖైదు విధిస్తూ ఒక్కోకరికి రూ. 10 వేల చోప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.