సీన్ రివర్స్ : ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్‌కు చెందిన పెండ్యాల

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 08:07 AM IST
సీన్ రివర్స్ : ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య

Updated On : October 15, 2019 / 8:07 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్‌కు చెందిన పెండ్యాల

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్‌కు చెందిన పెండ్యాల సూర్యశ్రీ భాస్కరరావు.. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏం జరిగిందో కానీ.. ఆ యువతి మాట్లాడటం ఆపేసింది. భాస్కరరావుని దూరం పెట్టింది. దీంతో ప్రియురాలు మోసం చేసిందని మనస్తాపం చెందిన భాస్కరరావు.. ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. భాస్కరరావు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణం అదేనా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఆ యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమెని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె వల్లే భాస్కరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తమ కొడుకు మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని భాస్కరరావు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.