Maharashtra Police : దొంగని పట్టుకోవటానికి మారువేషాల్లో పోలీసులు .. పండ్లు, కూరగాయాలు అమ్ముతు, ఆటో డ్రైవర్లుగా అవతారాలు

వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగను పట్టుకోవటానికి పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు, కూరగాయాలు అమ్మారు. ఆటో డ్రైవర్లుగా మారారు.

Maharashtra Police : దొంగని పట్టుకోవటానికి మారువేషాల్లో పోలీసులు .. పండ్లు, కూరగాయాలు అమ్ముతు, ఆటో డ్రైవర్లుగా అవతారాలు

Maharashtra police

Updated On : April 15, 2023 / 12:22 PM IST

Maharashtra police : నేరస్థుల్ని పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వింటుంటాం. కానీ మహారాష్ట్ర పోలీసులు దొంగల్ని పట్టుకోవటాని చేసిన పని గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ పోలీస్ అంటాం. వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగని పట్టుకోవటానికి మహారాష్ట్ర పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు అమ్మే వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారిగా, ఆటో నడుపుతు డ్రైవర్లుగా వేషాలు వేసి ఎట్టకేలకు గొలుసుల చోరీ కేటుగాళ్లను పట్టుకుని అరెస్ట్ చేశారు.

తమ అండర్ కవర్ ఆపరేషన్ గురించి మహారాష్ట్ర పోలీసులు చెప్పిన వివరాలను పరిశీలిస్తే..అంబివలీ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల అబ్బాస్‌ అమ్జద్‌ ఇరాన్ అనే పాత నేరస్థుడు గొలుసు చోరీల్లో అందెవేసిన చెయ్యి..అతని కంట పడిదంటే చేతిలోకి వచ్చి తీరాల్సిందే. ఇలా గొలుసులు చోరీలు చేస్తూ పోలీసులకు దొరకుండా ముప్పు తిప్పులు పెడుతు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీ తెలిసినా పట్టుకోవటానికి వెళ్లగా చిక్కినట్లే చిక్కి మాయం అయిపోయేవాడు. పైగా అతడిని అరెస్ట్ చేస్తే అతని తరపు బంధువులు పోలీసులపై దాడులు చేయటానికి కూడా వెనుకాడకుండా ప్లాన్ చేసుకుంటు తప్పించుకుంటుండేవాడు. మహారాష్ట్రలో పలు సందర్భాల్లో దొంగలను, నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేస్తే వారి బంధువులు పోలీసులపై దాడులు చేసిన ఘటనలో జరిగాయి.

దీంతో ఫాల్గర్ జిల్లా అంబివలీ పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..సదరు దొంగను పట్టుకోవాలని ప్లాన్ వేశారు. అలా పోలీసులు మారువేషాల్లో ఆపరేషన్‌ను చేపట్టారు.దీంట్లో భాగంగానే పండ్లు, కూరగాయలు అమ్మేవారిగాను, ఆటో,టాక్సీలు నడిపేవారుగాను మారువేషాలల్లో తిరిగే వారు.అంతేకాదు రోడ్లపై నిరాశ్రయులుగా అవతారమెత్తి మూడే కంటికి తెలియకుండా సదరు దొంగ కోసం వేయి కళ్లతో గాలించేవారు.

అలా రెండు వారాలపాటు నిఘా పెట్టారు.  ఎక్కడికి వెళుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏఏ పనులమీద తిరుగుతున్నాడు?అని నిఘా వేశారు. అలా ఇతరులతో కలిసి ఉండగా అరెస్ట్ చేయటం రిస్కుగా భావించిన పోలీసులు ఓ రోజు ఒంటరిగా ఉండగా పట్టుకుని చాకచక్యంగా ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలా గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు ఇరానీని అదుపులోకి తీసుకున్నారు. ఇరానీ అరెస్టుతో జిల్లాలో ఏడు గొలుసు చోరీల కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. అతనిని విచారించిన తరువాత రెండు మోటార్ బైకులు,రూ.3.31 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరానీపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు.