మంచిర్యాలలో విషాదం : ప్రాణం తీసిన కరెంటు బిల్లు

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 04:07 AM IST
మంచిర్యాలలో విషాదం : ప్రాణం తీసిన కరెంటు బిల్లు

Updated On : April 27, 2019 / 4:07 AM IST

కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. 

బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఎన్‌క్లేవ్ బస్తీలో గద్దెల నర్సయ్య నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటికి కరెంటు మీటర్ ఉంది. అయితే..13 ఏళ్లుగా కరెంటు బిల్లులు పంపియ్యలేదు ట్రాన్స్ కో అధికారులు. ఇటీవలే కరెంటు సిబ్బంది వచ్చి రూ. 25వేలు బిల్లు వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నర్సయ్య కాగజ్ నగర్‌‌లో ఉన్న సబ్ డివిజన్ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ రూ. 7వేల 500 కట్టాడు. అయితే..రూ. 58వేల బిల్లును చెల్లించాలని అధికారులు ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం ఆశించారు.

అదే రోజు కాగజ్‌నగర్ సబ్ డివిజన్ ఆఫీసుకు వెళ్లాడు నర్సయ్య. బిల్లు కట్టాలని అధికారులు చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. అధికారుల వత్తిడి కారణంగా చనిపోయాడని నర్సయ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.