Texas : మద్యం మత్తులో తలపై టపాసులు పేల్చుకున్న వ్యక్తి…
మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.

Texas Man Died
Texas : మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.
అమెరికాలోని టెక్సాస్ నగరంలో పాబ్లో రూయజ్(43) అనే వ్యక్తి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆక్రమంలో అందరూ మద్యం సేవించారు. ఈ ఆనందంలో పాబ్లో ఇంట్లో ఉన్న బాణాసంచా తీసుకు వచ్చి పేల్చాడు. ఉన్నట్టుండి టపాసులను తన తలపై పెట్టుకుని పేల్చుకున్నాడు.
ఈక్రమంలో బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లి మరణించాడు. మద్యం మత్తులోనే ప్లాబో ఈ చర్యకు పాల్పడినట్లు అతని స్నేహితుడు తెలిపాడు. ఘటనా స్ధలానికి వచ్చిన శాన్ ఆంటోనియో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే్స్తున్నారు.
Also Read : Telangana Rains : రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష