Two Wives : ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక వ్యక్తి ఆత్మహత్య

ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న  ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

Two Wives : ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక వ్యక్తి ఆత్మహత్య

ATP Two Wives

Updated On : January 3, 2022 / 5:44 PM IST

Two Wives : ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న  ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అనంతపురంలోని నవోదయ కాలనీకి చెందిన సాకే నాగేంద్ర(42) అనే వ్యక్తి   క్రిటి డ్రిప్ కంపెనీలో   జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు. అతని భార్య, కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మూడేళ్ల క్రితం బదిలీపై  చిత్తూరుకు వెళ్ళాడు.   ఆ సమయంలో అక్కడ అతనికి దుర్గా భవాని అనే మహిళతో పరిచయం ఏర్పడింది.  ఆమెతో పరిచయం సహజీవనానికి దారితీసింది.  కొన్నాళ్లకు అనంతపురం తిరిగి వచ్చాడు.

చిత్తూరులో పరిచయం అయిన దుర్గా భవానిని అనంతపురం తీసుకువచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎంఐజీ బస్టాప్ వద్ద ఉన్న  ఒక ఇంటిలో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల పోషణ భారమయ్యింది.

Also Read : Karnataka BJP : సీఎం సమక్షంలోనే రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వాగ్వివాదం

ఆదివారం దుర్గా భవానీ ఇంటికి వచ్చిన నాగేంద్ర బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకు  రాకపోవటంతో దుర్గాభవాని…తమ ఇంటి వెనుక వీధిలో ఉండే నాగేంద్ర స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దుర్గాభవానీ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే నాగేంద్ర ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.