తల్లితో అక్రమ సంబంధం…కూతురిపై అత్యాచారం

హైదరాబాద్ లో దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కామాంధుడు ఆమె మైనర్ కుమార్తె పై అత్యాచారం చేశాడు. వనస్దలిపురంలోని ఒక మహిళ తన భర్తతో విభేదాలు రావటంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఇబ్రహీంపట్నానికి చెందిన నరసింహ యాదవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఆ కుటుంబానకి దగ్గరైన క్రమంలో తరచుగా ఆమె ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ పరిచయంతో ఆమహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో కూడా ఇంటికి వచ్చిపోయే నరసింహ ఆమె కూతురిపై కన్నేశాడు.
ఇటీవల కొన్నిరోజులుగా తన కుమార్తె బలహీనంగా..ఉత్సాహాం లేకుండా ఉండటాన్ని గమనించిన మహిళ కుమార్తెను ప్రశ్నించింది. కూతురు తనపై నరసింహ చేస్తున్న అకృత్యాన్ని చెప్పటంతో షాక్ కు గురైంది.
మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చే నరసింహా ఆ మైనర్ బాలికపై గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడని ఆబాలిక తెలిపింది. మహిళ వెంటనే నరసింహ యాదవ్ పై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. పోక్సో చట్టంకింద కేసు పెట్టిన పోలీసులు పరారీలో ఉన్న నరసింహ కోసం గాలిస్తున్నారు.
Must Read>>కువైట్‌లో కొత్త బిల్లు.. 8లక్షల మంది భారతీయులు ఇంటికే!