Extra Marital Affair : గుంటూరు జిల్లాలో హత్యకు దారి తీసిన సహజీవనం

గుంటూరు జిల్లాలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె కుమారుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.

Extra Marital Affair : గుంటూరు జిల్లాలో హత్యకు దారి తీసిన సహజీవనం

Guntur District Murder

Updated On : January 4, 2022 / 6:08 PM IST

Extra Marital Affair :  గుంటూరు జిల్లాలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె కుమారుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిలో నివసించే ఇందిరకు భర్త చనిపోయాడు. అంజిరెడ్డి కాలనీలో కొడుకు వంశీ వర్ధన్ తో కలిసి ఆమె నివసిస్తోంది. ఇందిరకు కట్ట రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సహజీవనం చేయటం మొదలెట్టారు.

ఈక్రమంలో గతనెల 26వ తేదీన రాజా అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. అనారోగ్యంతో రాజా మరణించాడని చెప్పి ఇందిర అంత్యక్రియలు పూర్తి చేయించింది. కానీ 27వ తేదీ తాడేపల్లి పోలీసులు అనుమానాస్ఫద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజా వంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్టులో రాజా హత్యకు గురైనట్లు తేలింది. దీంతో పోలీసులు రాజా ప్రియురాలు ఇందిర, ఆమె కొడుకు వంశీ వర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు.
Also Read : AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 334 కోవిడ్ కేసులు
మద్యం సేవించిన మత్తులో రాజా, వంశీల మధ్య ఘర్షణ జరిగిందని… ఆఘర్షణలో రాజాను వంశీ కత్తితో పొడిచి చంపినట్లు తేలింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపారు.