Extra Marital Affair : స్నేహితుడి ప్రియురాలితో పరిచయం…హత్య

తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని, ఒక వ్యక్తి  చంపి, పూడ్చిపెట్టిన  ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.  ఏడాది తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసారు.

Extra Marital Affair : స్నేహితుడి ప్రియురాలితో పరిచయం…హత్య

Chittoor Murder

Updated On : April 5, 2022 / 8:34 PM IST

Extra Marital Affair :  తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని, ఒక వ్యక్తి  చంపి, పూడ్చిపెట్టిన  ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.  ఏడాది తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసారు. చిత్తూరు జిల్లా వి. కోట సీఐ ప్రసాద్ బాబు ఇచ్చిన సమచారం మేరకు వి. కోటలోని ముదిమడుగుకు చెందిన ఇస్మాయిల్(23) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ ఉండేవాడు. అతనికి అదే ఊరిలోని నారాయణ నగర్ కు చెందిన నరేష్ స్నేహితుడు.

వీరిద్దరికీ పరిచయం అయిన ఏడాదిన్నర తర్వాత ఇస్మాయిల్ బెంగుళూరు వెళ్లి అక్కడ బంధువులు ఇంట్లో ఉంటూ అక్కడే కరెంట్ పనులు  చేసుకుంటూ జీవిస్తున్నాడు. నరేష్ అదే గ్రామంలో నివసిస్తున్నాడు.  నరేష్ గ్రామంలోని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  ఈవిషయానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పటంతో ఇంట్లో నుంచి వచ్చి మహిళతో కలిసి జీవించసాగాడు.

ఇస్మాయిల్ బెంగుళూరు నుంచి   స్వగ్రామానికి వచ్చినప్పుడు నరేష్ వద్దకు కూడా వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈక్రమంలో నరేష్ ప్రియురాలితో ఇస్మాయిల్ కు పరిచయం పెరిగింది. క్రమంగా ఆమెతో సన్నిహితంగా మెలగసాగాడు. నరేష్ లేనప్పుడు   ఇంటికి   వచ్చి వెళుతూ ఉండేవాడు. దీన్ని  గమనించిన నరేష్ ఇస్మాయిల్ ను  అంతమొందించాలని  ప్లాన్ వేశాడు.

గతేడాది (2021) జనవరి 5వ తేదీన ఇస్మాయిల్ తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని నరేష్ ను కోరాడు.  అదే రోజు సాయంత్రం వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్ నరేష్ కు ఫోన్ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ కలిసి మద్యం  బాటిల్ తీసుకుని వి. కోట చెరువులోకి వెళ్లారు.  అక్కడ ఇద్దరి మధ్య మహిళ విషయంలో వాగ్వాదం జరిగింది.

ఆసమయంలో మద్యం తాగుతున్నట్లు నటించాడు నరేష్. ఇస్మాయిల్ బాగా మద్యం సేవించాడని నిర్ధారించుకుని మందు బాటిల్ తో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడే ఇసుక కోసం తవ్విన గుంతలో ఇస్మాయిల్ మృతదేహాన్ని పూడ్చి మట్టిని కప్పేసి వెళ్లిపోయాడు.
Also Read : KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇస్మాయిల్ స్నేహితులను విచారించటంతో వారిలో ఉన్ననరేష్ నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులకు ఇస్మాయిల్ ను పాతి పెట్టిన ప్రదేశానికి తీసుకు వెళ్లి చూపించాడు.