Man Raped Another Young Man : చెరుకు రసం ఇప్పించి “యువకుడి” పై అత్యాచారం

పురుషులు మహిళలపైనే అత్యాచారం చేస్తారని అనుకుంటే పొరపాటే... సమాజంలో వింత వింత పోకడలు వెలుగు చూస్తున్నాయి.  స్వలింగ సంపర్కులు ఇటీవలి కాలంలో  పెరిగి పోయారు.

Man Raped Another Young Man : చెరుకు రసం ఇప్పించి “యువకుడి” పై అత్యాచారం

Man Raped Another Young Man

Updated On : October 19, 2021 / 1:52 PM IST

Man Raped Another Young Man :  పురుషులు మహిళలపైనే అత్యాచారం చేస్తారని అనుకుంటే పొరపాటే… సమాజంలో వింత వింత పోకడలు వెలుగు చూస్తున్నాయి.  స్వలింగ సంపర్కులు ఇటీవలి కాలంలో  పెరిగి పోయారు. కామోన్మాదులు   స్వలింగ జాతులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాంటి వార్తలు వారికి నచ్చితేనే వారు కలిసేవారని వినేవాళ్లం ఇప్పుడు అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఒక యువకుడిపై మరో యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

దక్షిణ కన్నడ జిల్లాలోని   పుత్తూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని  కబాక అనే గ్రామానికి చెంది 20 ఏళ్ల యువకుడు గత శుక్రవారం అక్టోబర్15వ  తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఈవెనింగ్ వాకింగ్ కు వెళ్లాడు.  అతను రైల్వే ట్రాక్ సమీపంలో వాకింగ్ చేస్తున్నప్పుడు   అదే గ్రామానికి చెందిన హనీఫ్ అనే వ్యక్తి తారసపడ్డాడు.   ఇద్దరూ కాసేపు  వాకింగ్ చేశారు.

ఇంటికి తిరిగి వెళ్లేప్పుడు చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా… చెరుకురసం ఇప్పిస్తాను తాగి వెళ్లు అని హనీఫ్  యువుకుడికి ఆఫర్ చేశాడు.  సరే తెలిసిన వ్యక్తే కదా అని చెరుకు రసం తాగటానికి యువకుడు హనీఫ్ వెంట వెళ్ళాడు. అలా వెళుతున్న క్రమంలో హనీఫ్  యువకుడిని  చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి యువకుడిని వదిలి పెట్టాడు. ఈ ఘటనతో భయపడిపోయిన యువకుడు భయంతో వణుకుతూ ఇంటికి వెళ్ళాడు.

Also Read : Son Looted Fathers House : టెక్నాలజీ వాడి తండ్రి ఆస్తి,నగదు కాజేసిన పుత్రరత్నం

ఇంటికి వెళ్లినా అతనిలో భయం పోలేదు. వణుకు తగ్గలేదు. బట్లల నిండా బురద అంటి  ఉంది. కొడుకు వాలకం చూసిన తండ్రి కంగారు పడి ఏం జరిగిందని అడిగాడు. దీంతో ఆయువకుడు భోరున విలపిస్తూ తండ్రికి జరిగినదంతా చెప్పాడు. దీంతో తండ్రి కొడుకును తీసుకుని పుత్తూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు హనీఫ్ పై ఐపీసీ సెక్షన్ 504, 323,377,506 సెక్షన్ల  కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.