Viral Video: ఏడుగురు పిల్లలతో భయానక స్కూటర్ రైడ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

మునవ్వర్ షా తన స్కూటర్‌పై ఇద్దరు పిల్లలను ముందు నిల్చోబెట్టాడు, మరో ముగ్గురు పిలియన్ రైడ్ చేస్తున్నారు. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్‌పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను రికార్డ్ చేసిన స్థానికుడు ట్విట్టర్‌లో షేర్ చేసి ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు

Viral Video: ఏడుగురు పిల్లలతో భయానక స్కూటర్ రైడ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

Updated On : June 27, 2023 / 4:22 PM IST

Mumbai: ఒక బండి మీద ఇద్దరు మాత్రమే వెళ్లాలి. కానీ కొన్నిసార్లు ముగ్గురు కనిపిస్తుంటారు. అలాంటి వారు పోలీసులకు కనిపించినా కెమెరాలకు కనిపించినా చట్ట ప్రకారం జరిమానాలు విధంచడమో, గట్టి హెచ్చరికలు చేయడమో జరుగుతుంటాయి. అయితే ఇద్దరు ప్రయాణించాల్సిన బండిపై ముగ్గురు ప్రయాణించడాన్ని తప్పిదంగా చూడొచ్చు. కానీ ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే.. చట్ట ఉల్లంఘనే. భయంకరమైన అలాంటి ప్రయాణాల వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి కనిపించింది. ఒక వ్యక్తి తన స్కూటర్ మీద ఏడుగురితో ప్రయాణం చేశాడు. పైగా వారంతా పిల్లలు కావడం గమనార్హం. ఆ వ్యక్తిని మునవ్వర్ షా అని పోలీసులు గుర్తించారు. అతడు కొబ్బరికాయల దుకాణం నడుపుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో సదరు వీడియో వైరల్ కావడంతో మునవ్వర్ షాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.


వీడియోలో.. మునవ్వర్ షా తన స్కూటర్‌పై ఇద్దరు పిల్లలను ముందు నిల్చోబెట్టాడు, మరో ముగ్గురు పిలియన్ రైడ్ చేస్తున్నారు. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్‌పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను రికార్డ్ చేసిన స్థానికుడు ట్విట్టర్‌లో షేర్ చేసి ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు. వీడియోలో కనిపిస్తున్న ఏడుగురిలో నలుగురు మునవ్వర్ షా పిల్లలు కాగా, మిగిలిన వారు పొరుగువారి పిల్లలు.