యువకుడిపై అమృత కంప్లయింట్..ఎందుకు ?

మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత..ఓ యువకుడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తోంది అమృత. ఆ యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉంటున్నాడని వెల్లడించింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది.
2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం సృష్టించింది. గిరిజ నన్ను క్షమించు..అమృత..ఇంటికి రా..అని ఓ లేఖ అక్కడ కనిపించింది. మారుతీరావు అంత్యక్రియలకు భారీ పోలీసు బందోబస్తుతో అమృత వచ్చింది. కానీ..బంధువులు అందుకు అంగీకరించలేదు. దీంతో అమృత తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో..తల్లిని 2020, మార్చి 14వ తేదీ శనివారం అమృత కలిసింది.
* 2018, జనవరి 31 ప్రణయ్, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
* 2018, సెప్టెంబర్ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన..మారుతీ రావు..ప్రణయ్‌ని అతి దారుణంగా హత్య చేయించాడు.
* ఈ పరువు హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
* జూన్ 12వ తేదీన పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. 1600 పేజీల ఛార్జీషీట్‌ను న్యాయస్థానంలో సమర్పించారు.
* కూతురు తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్, ఎంఏ కరీం, అస్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు.
* మారుతీ రావు(ఆత్మహత్య చేసుకున్నాడు), శ్రవణ్, కరీం బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.
Read More : ఏపీలో కరోనా : ఆ జిల్లాల్లో టెన్షన్..కర్నూలులో అనుమానిత వ్యక్తి ఎక్కడ