భయంతో జనం పరుగులు : బిగ్ బజార్ లో భారీ మంటలు
సెంట్రల్ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మాతుంగాలో సోమవారం తులసీ పైప్ రోడ్ దగ్గర బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ ఔట్ లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సెంట్రల్ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మాతుంగాలో సోమవారం తులసీ పైప్ రోడ్ దగ్గర బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ ఔట్ లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సెంట్రల్ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మాతుంగాలో సోమవారం (ఏప్రిల్ 29, 2019) తులసీ పైప్ రోడ్ దగ్గర బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ ఔట్ లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఔట్ లెట్ పైకప్పు నుంచి దట్టమైన పొగ వ్యాపించి మెల్లగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరగడంతో అక్కడి జనం భయంతో భయటకు పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిలినట్టు ఎలాంటి సమాచారం లేదు. ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.