రూ. 12కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల లారీని ఎత్తుకెళ్లారు..!

  • Published By: sreehari ,Published On : August 26, 2020 / 08:46 PM IST
రూ. 12కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల లారీని ఎత్తుకెళ్లారు..!

Updated On : August 26, 2020 / 8:57 PM IST

ఒకటి రెండు మొబైల్ ఫోన్లు చోరీ చేస్తే గిట్టుబాటు కాదని అనుకున్నారేమో.. ఏకంగా మొబైల్ ఫోన్ల లారీనే ఎత్తుకెళ్లారు.. ఆ లారీలో రూ.12 కోట్ల విలువైన కొత్త మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని నగరి వద్ద జరిగింది.

మొబైల్ ఫోన్ల రవాణా చేసే లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. తమిళనాడులోని పెరుంబుదూరునుంచి ముంబైలోని Mi సంస్థ గోడామ్‌కు లారీ వెళ్తోంది.. తమిళనాడు-ఏపీ సరిహద్దు సమీపంలోకి రాగానే దుండగులు లారీని అడ్డగించారు. డ్రైవర్, కాళ్లు, చేతులు కట్టి కిందపడేశారు.



లారీని తీసుకెళ్లి పుత్తూరు దగ్గర మరాఠీ గేటు వద్ద వదిలి పరారయ్యారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు సరిహద్దు అవతలి నుంచే కొంతమంది లారీని ఫాలో అయినట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.

Mobile Phones Lorry robbered by theives in Chittoor district

లారీలో 16 బాక్సుల్లో రూ.12 కోట్ల విలువైన 15వేల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. ఈ మొబైల్ ఫోన్లను ముంబయికి తరలిస్తున్నారు. 8 పెట్టెల్లోని ఫోన్లను మాత్రమే దుండగులు అపహరించి మిగతా 8 పెట్టెలను వదిలేసి వెళ్లారు.



మొబైల్ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎత్తుకెళ్లిన ఫోన్ల విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.ఈ ఘటనపై పెరుంబుదూరులోని Mi ఆఫీసుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.