9నెలల తర్వాత బయటపడిన నిజం : ప్రియుడి కోసం కన్నతల్లే చంపింది

అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 06:53 AM IST
9నెలల తర్వాత బయటపడిన నిజం : ప్రియుడి కోసం కన్నతల్లే చంపింది

Updated On : September 21, 2019 / 6:53 AM IST

అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ

అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ అమ్మ ప్రేమ అంటే. కానీ ఆ అమ్మ..  మాతృత్వానికే చెడ్డ పేరు తెచ్చింది. తన సుఖం కోసం ఏ తల్లి చేయకూడని పని చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకొడుకుని కడతేర్చింది. ప్రియుడి కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది. 9 నెలల తర్వాత  అసలు నిజం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తొమ్మిదేళ్ల కొడుకుని ప్రియుడితో కలసి కిరాతకంగా హత్య చేసింది తల్లి. 9 నెలల తర్వాత పోలీసులు ఈ కేసు మిస్టరీని  ఛేదించారు. సత్తెనపల్లి మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన షేక్‌ జాన్‌వలి, సైదాబీ దంపతులకు కుమారుడు విజ్వాన్‌ (9), ఓ కుమార్తె ఉన్నారు. జాన్‌వలి కరెంటు పనులు చేస్తాడు. మద్యానికి బానిసయ్యాడు.  భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో భార్య సైదాబీ అదే గ్రామానికి చెందిన అవివాహితుడు వడ్లమాను శ్రీకాంత్‌రెడ్డితో పరిచయం పెట్టుకుంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

రోజూ శ్రీకాంత్‌రెడ్డి సైదాబీ ఇంటికి వచ్చేవాడు. ఇది గమనించిన కొడుకు తల్లిని ప్రశ్నించాడు. శ్రీకాంత్ మన ఇంటికి ఎందుకొస్తున్నాడని నిలదీశాడు. విషయాన్ని నాన్నకు చెబుతానని అన్నాడు. దీంతో సైదాబీ  భయపడిపోయింది. ప్రియుడి గురించి భర్తకు చెబుతాడనే ఆందోళనతో కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంది. 2018 డిసెంబర్‌ 15న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న విజ్వాన్‌ను శ్రీకాంత్‌రెడ్డి కలిశాడు. మీ  అమ్మ తీసుకురమ్మంది అని చెప్పి బైక్ పై ఎక్కించుకున్నాడు. నేరుగా బీరవల్లిపాయ అడవి సమీపంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే సైదాబీ అక్కడుంది. బైక్ పై సైదాబీని కూడా ఎక్కించుకుని దట్టమైన బీరవల్లిపాయ కొండల  సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ రాయితో విజ్వాన్‌ తలపై కొట్టి దారుణంగా చంపారు. తర్వాత మృతదేహాన్ని ఇద్దరూ కలసి గుట్టల్లోకి విసిరేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. విజ్వాన్ కనిపించడం  లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

ఇటీవల రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో సత్తెనపల్లి డీఎస్పీ దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లి సైదాబీ ఫోన్‌ కాల్‌ లిస్టు పరిశీలించగా అనుమానాలు వచ్చాయి.  ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రమేయం బయటపడింది. తల్లిని, ప్రియుడు శ్రీకాంత్‌ ని తమ స్టైల్ లో విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. బాలుడిని హత్య చేశామన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో  హాజరుపరిచారు. ప్రియుడి కోసం కన్నతల్లే కొడుకుని హత్య చేసిందనే నిజం తెలిసి కుటుంబసభ్యులు, స్థానికులు షాక్ తిన్నారు.