Mumbai: 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బిల్డర్

ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్ పారస్ పోర్‌వాల్ 23వ అంతస్తులోని తన హోమ్ జిమ్ పైనుంచి దూకి గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై చించ్‌పోకి రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్‌లో ఆయన ఉంటున్నారు. జిమ్ బాల్కనీ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కిందకు దూకినట్టు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల పారస్ రాసిన ఓ సూసైడ్ నోట్‌ను జిమ్‌లో పోలీసులు కనుగొన్నారు.

Mumbai: 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బిల్డర్

Updated On : October 20, 2022 / 3:31 PM IST

Mumbai: ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్ పారస్ పోర్‌వాల్ 23వ అంతస్తులోని తన హోమ్ జిమ్ పైనుంచి దూకి గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై చించ్‌పోకి రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్‌లో ఆయన ఉంటున్నారు. జిమ్ బాల్కనీ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కిందకు దూకినట్టు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల పారస్ రాసిన ఓ సూసైడ్ నోట్‌ను జిమ్‌లో పోలీసులు కనుగొన్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, ఎవరిపైనా దర్యాప్తు చేయవద్దని ఆ నోట్‌లో ఆయన పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు. పారస్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఒక గార్డు చూసి, వెంటనే కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పారస్ ఆత్యహత్యకు పాల్పడడానికి కారణాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఆర్థికంగా నష్టపోవడం వంటి వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Mission LiFE: పర్యావరణ సమస్యతో పోరాడాలంటే ఆ ఒక్కటి చాలా ముఖ్యం.. ప్రధాని మోదీ