Sanathnagar Crime: సనత్ నగర్ పరిధిలో ఘోరం: నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి పరారైన దుండగుడు

నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి దుండగుడు పరారైన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటన

Sanathnagar Crime: సనత్ నగర్ పరిధిలో ఘోరం: నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి పరారైన దుండగుడు

Crime

Updated On : March 31, 2022 / 4:48 PM IST

Sanathnagar Crime: హైదరాబాద్ నగర పరిధిలో నేరాల నియంత్రణ నిమిత్తం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా..నేరగాళ్ల తీరు మారడంలేదు. నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి దుండగుడు పరారైన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటనలో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సనత్ నగర్ పీఎస్ పరిధి భరత్ నగర్లోని మహేశ్వరీ నగర్ లో బాధిత మహిళ(26) తన భర్తతో కలిసి నివాసముంటోంది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. బాధిత మహిళ గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన బాధితురాలి భర్త.. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.

Also read:West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం..!

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో..పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో మహిళపై ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు ఎవరు? అసలు ఇంట్లోకి ఎలా వచ్చాడు? కుటుంబ సభ్యులందరు ఉండగా మహిళ గొంతు ఎందుకు కోసాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. క్లూస్ టీం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:Baba Ramdev : బాబా రాందేవ్‌ను ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్లు