బేస్ బాల్ బ్యాట్‌తో హింసించి, రేప్ చేసి, సజీవ దహనం.. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో పోకర్ స్టార్ దారుణ హత్య

  • Published By: naveen ,Published On : September 18, 2020 / 05:13 PM IST
బేస్ బాల్ బ్యాట్‌తో హింసించి, రేప్ చేసి, సజీవ దహనం.. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో పోకర్ స్టార్ దారుణ హత్య

Updated On : November 6, 2020 / 2:45 PM IST

మిచిగాన్‌లో పోకర్ స్టార్‌ దారుణ హత్యకు గురైంది. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో అత్యంత అమానుషంగా ఆమెను చంపేశారు. జననాంగాల్లో పొడవైన వస్తువుతో హింసించి అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఆమె జుట్టు కాలిపోయింది. నాలుక మంటల్లో మాడిపోయింది. అత్యంత దారుణ స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన నిపుణులు నిర్ఘాంతపోయారు.

ఆ పోకర్ స్టార్ పేరు సుసీ జావో. బీజింగ్‌కి చెందిన సుసీ జావో కుటుంబం డెట్రాయిట్‌లో స్థిరపడింది. సుసీ చాలా తెలివైన మహిళ. పోకర్ స్టార్‌గా ఎదిగింది. లాస్ ఏంజెల్స్, లాస్ వెగాస్‌లో ఆమె ప్రముఖ పోకర్ స్టార్‌గా గుర్తింపు పొందింది. పోకర్ స్టార్‌గా మారిన తర్వాత సుమారు 3 లక్షల డాలర్లు సంపాదించింది. తల్లిదండ్రులతో కలసి ఉండేందుకు కొన్ని రోజుల క్రితం ఆమె డెట్రాయిట్ వచ్చేసింది.


జూలె 12న ఇంటి నుంచి వెళ్లిన సుసీ దారుణ హత్యకు గురైంది. ఆమెను లైంగికంగా హింసించి కిరాతకంగా చంపేశారు. చేతులు, కాళ్లు కట్టేసి పొడవాటి వస్తువును ఆమె జననాంగాల్లోకి జొప్పించి నరకం చూపించారు. మర్మాంగంలో పొడవాటి వస్తువు పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన బేస్‌బాల్ బ్యాట్ లభ్యమైంది. ఆ బ్యాట్‌ని జననాంగంలోకి జొప్పించి హింసించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ తర్వాత ఆమె బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఆమె జననాంగం, నాలుక మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఆమె జుట్టు కూడా పూర్తిగా కాలిపోయింది. సుమారు 90 శాతం కాలిన గాయాలతో ఆమె గుర్తుపట్టలేనంతగా ఉంది. ఈ కేసులో డెట్రాయిట్‌కి చెందిన జెఫ్రీ మోరిస్‌(60)‌ని ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ఆమె చనిపోయే ముందు రోజు రాత్రి ఇద్దరూ ఫోన్ కాల్స్ చేసుకున్నారని.. ఒకే హోటల్ గదిలో ఉన్నట్లు చెబుతున్నారు. సాక్ష్యాధారాల మేరకు అతనే ఆమెను లైంగికంగా హింసించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు..



పార్కింగ్ లాట్ లో సుసీ మృతదేహాన్ని అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు గుర్తించారు. అది ఒక మనిషి శరీరం అని నమ్మడానికి వీల్లేని విధంగా, గుర్తు పట్టలేని రీతిలో మృతదేహం ఉందని అతడు చెప్పాడు. 2009లో సుసీ పోకర్ స్టార్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ గా మారింది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా సుసీ తిరిగి మిచిగాన్ కు వచ్చేసింది అని సుసీ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, ఈ కేసులో దోషి మోరిస్ అని చెప్పడానికి ఆధారాలు పక్కాగా ఉన్నాయని, అతడు శిక్షార్హుడు అని కోర్టు వ్యాఖ్యానించింది.