Narcotics Seized : హైదరాబాద్‌లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు హైదరాబాద్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.100కోట్ల దాకా ఉంటుందని అంచనా.

Narcotics Seized : హైదరాబాద్‌లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

Narcotics Seized

Narcotics Seized : అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు హైదరాబాద్‌లో భారీ ఎత్తున  డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.  వీటి విలువ సుమారుగా రూ.100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఎన్సీబీ అధికారుల దాడుల్లో 91 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

బీదర్‌లోని హిందూ ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారు  చేస్తున్నట్లు కర్ణాటక, తెలంగాణ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉంటున్న హిందూ ఫార్మా ఎండీ ఎన్వీరెడ్డిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంట్లో డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించి 62 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు, హైదరాబాద్‌ ఎన్సీబీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ భారీగా చేతులు మారుతున్నట్టు గుర్తించిన అధికారులు రెండు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతున్నారు. తెలంగాణతో పాటు కర్నాటకలో పలువురు వ్యాపార వేత్తల ఇళ్లలో గత గురువారం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  హిందూ ఫార్మా నుంచి ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్‌ను సరాఫరా చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు.