మోడీకి బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్

ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది.
ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి బెదరింపులకు దిగాడు. దీంతో నోయిడా ఫేస్-3 పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ కాల్ లొకేషన్‌ను ట్రేస్ చేసి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
నోయిడాలోని ఫేజ్-3 లో నివాసముంటున్న ఆ వ్యక్తి హర్యానాకు చెందిన హర్భజన్ సింగ్(33)గా గుర్తించారు. విచారణలో ఆ వ్యక్తి డ్రగ్స్‌కు బానిసైనట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు అడిషినల్ డీసీపీ(సెంట్రల్ నోయిడా) అంకుర్ అగర్వాల్ తెలిపారు. ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.మరిన్ని వివరాల కోసం నిందితుడిని తమ అదుపులో ఉంచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
A man, Harbhajan, has been arrested in Phase-3 Police Station area of Noida for calling Dial 100 & threatening PM Narendra Modi. He is being questioned. Prima facie, he seems to be a drug addict: Additional DCP (Central Noida) Ankur Aggarwal pic.twitter.com/SFVqiCv9JS
— ANI UP (@ANINewsUP) August 10, 2020