సినీ నటుడు, ఎంపీపై, గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య

సినీ నటుడు, ఎంపీపై, గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య

Updated On : December 21, 2020 / 11:18 AM IST

Domestic violence, dowry case lodged against BJD MP  : సినీ నటుడు, ఒడిషాలోని కేంద్రపార నుంచి ఎంపికైన బిజూ జనతా దళ్ ఎంపీ, అనుభవ్ మొహెంతీపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపులు కేసు నమోదైంది. ఆయన భార్య, నటి వర్ష ప్రియదర్శిని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుభవ్ మొహంతి అతని అనుచరులు ఇద్దరు డిసెంబర్ 18వ తేదీ రాత్రి కటక్ లోని నందిసాహి వద్ద ఎంపీకి చెందిన ఒక ఇంట్లో తనను బంధించారని, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారి సహాయంతో తాను బయట పడ్డానని ఆమె తన ఫిర్యాదులో పేర్కోంది.

వాస్తవానికి డిసెంబర్ 18న వర్ష తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిత్వాన్నికించపరిచేలా తన భర్త ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. అదే రోజు రాత్రి అనుభవ్ తన అనుచరులతో ఆమెను గదిలో బంధించి, బయట తాళం వేసి, తాళం చెవి వాచ్ మెన్ కి ఇచ్చి వెళ్లిపోయారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
barsha

తన భర్త అనుభవ్ ….తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆగస్ట 7కటక్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఎస్జెడిఎం) కోర్టులో గృహ హింస కేసును నమోదు చేసింది. అంతకు ముందు జులై 6 న ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం సెప్టెంబర్ 19న విడాకుల పిటీషన్ ను కటక్ లోని ప్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వర్షా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Barsha-Anubhav
కొన్ని నెలల క్రితం వర్షా, అనుభవ్ గొడవ పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె “అనుభవ్ ద్వారా నాకు,నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, అతని బారినుంచి మమ్మల్ని రక్షించాలని వేడుకుంటున్నానని పేర్కోన్నారు. అనుభవ్ మొహంతి, అతని అనుచరులు ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 498 ఎ, 341, మరియు 506 కింద కేసు కేసులు నమోదు చేసినట్లు కటక్ పోలీసు కమిషనర్ సుధాన్షు సారంగి ధృవీకరించారు.
Anubhav-Mohanty-Barsha-Priy-